Samantha : నాలో శక్తి తగ్గిపోయింది.. ఆ బాధ వర్ణించలేను సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత ( Samantha ) అనారోగ్య సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే .

ఈమె మాయోసైటిసిస్ వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే ఈ సమస్య నుంచి బయట పడటానికి తాను చాలా కష్టపడ్డాను అంటూ సమంత ఇటీవల వెల్లడించారు.ఇక మయోసైటిస్( Myositis ) తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్( Side Effects ) ని అధికమించడానికి కూడా చాలా సమయం పట్టిందని అందుకే తాను సినిమాలకు విరామం ఇచ్చినట్టు తెలిపారు.

ఇటీవల ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా పాడ్ కాస్ట్ లో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు.

సిటాడెల్ ( Citadel ) వర్క్ షాప్ లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు.ట్రైనింగ్ సెషన్ లో నా శక్తి సగానికి తగ్గిపోయింది.ఆ విషయం నాకు అర్థం అవుతుంది.

Advertisement

ఇలా శక్తి తగ్గిపోవడం ఒక వైపు మరో వైపు భారీ యాక్షన్ సన్నివేశాలలో( Action Scenes ) నటిస్తూ తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యాను.ఈ బాధ మరోవైపు ఆ సమయంలో నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వర్ణాతీతం అని తెలిపారు.

ఇక నా శరీరం వ్యాధుల నుంచి కోలుకోవడానికి ఆహారం కూడా పూర్తిగా తగ్గించేసానని సమంత వెల్లడించారు.

చాలాకాలం పాటు ఈ బాధలు భరించానని ముఖ్యంగా విపరీతమైనటువంటి కండరాల నొప్పులు తనని వేధించాయి అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ వ్యాధి కారణంగా ఈమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేయడంతో అభిమానులు ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత ఇన్ని కష్టాలు పడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక త్వరలోనే సమంత( Samantha Health ) తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు