విడాకులపై క్లారిటీ ఇచ్చేసిన సమంత.. చైతన్య కూడా క్లారిటీ ఇవ్వాలంటూ?

చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి చైతన్య, సమంత వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

నాగార్జున మొదట ఈ వివాహానికి అంగీకరించలేదని రానా, సమంత ఎంతో కష్డపడి నాగార్జునను ఒప్పించారని తెలుస్తోంది.

పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న జోడీలలో చైసామ్ జోడీ ఒకటి కాగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఆ మనస్పర్ధలు విడిపోవటానికి కారణం కావడం గమనార్హం.అయితే చైతన్య సమంత విడిపోయామని చెప్పారే తప్ప ఎందుకు విడిపోయారనే విషయాన్ని వెల్లడించడానికి మాత్రం అస్సలు ఇష్టపడలేదు.

సమంత విడాకుల తర్వాత మీడియాకు కూడా దూరంగా ఉండటంతో ఆమె విడాకుల గురించి స్పందించే అవకాశం రాలేదు.కాత్తువాకుల రెండు కాదల్ సినిమా ప్రమోషన్స్ కు కూడా సమంత దూరంగా ఉండటంతో చైసామ్ విడిపోవడం ఆభిమానులకు చిక్కుప్రశ్నగానే మిగిలింది.

అయితే కాఫీ విత్ కరణ్ షోలో సమంత పెళ్లి, విడాకుల గురించి పరోక్షంగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు.పెళ్లి తర్వాత జీవితం కభీ ఖుషి కభీ గమ్ లా ఉంటుందని అనుకుంటే కేజీఎఫ్ లా ఉందని ఆమె తెలిపారు.

Advertisement

పరోక్షంగా పెళ్లి తర్వాత సంతోషంగా లేకపోవడం వల్లే విడాకులు తీసుకున్నానని సమంత చెప్పేశారు.అయితే నాగచైతన్య కూడా పెళ్లి, విడాకుల గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

చైతన్యతో పని చేసిన చాలామంది హీరోయిన్లు చైతన్య చాలా కేరింగ్ అని ఎంతో బాగా చూసుకుంటారని చెబుతారు.కానీ సమంత మాత్రం చైతన్యతో విడిపోయి ఫ్యాన్స్ కు షాకిచ్చింది.సమంత కోరడం వల్లే చైతన్య విడాకులకు అంగీకరించారని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

త్వరలో చైసామ్ విడాకులకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.చైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement