ఆ విషయంలో చైతూపై సామ్ పైచేయి సాధించిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ చైతన్య విడాకుల అంశం అందరిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలిసి టాలీవుడ్ లో అభిమానులతో పాటు మిగతా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు అందుకే ఈ విడాకులు విషయాన్నీ అభిమానులు ఇప్పటికి జీర్ణించు కోలేక పోతున్నారు.ఇక విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా తమ కెరీర్ లపైనే ద్రుష్టి పెట్టారు.

వరుస సినిమాలతో ఇద్దరు కూడా బిజీగా ఉంటున్నారు.ఇప్పుడు సమంత,నాగ చైతన్య ఇద్దరు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు.

సామ్ వెర్సెస్ చైతూ అంటూ మీడియాలో వరుస కథనాలు కూడా ప్రచురితం అవుతున్నాయి.నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ తెరపై అడుగు పెట్టబోతున్నాడు.

Advertisement

అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చైతన్య నటించాడు.త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసారు.

అయితే ఈ ట్రైలర్ ను బట్టి చుస్తే ఈయన ఈ సినిమాలో కొన్ని క్షణాలు మాత్రమే కనిపిస్తాడు అని అని బయటకు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు.అందుకే ఈ సినిమాతో చైతూ ఎంట్రీ సరైనది కాదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.ఆ తర్వాత పుష్ప 2 తో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.కానీ చైతూ గురించి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడుకోలేదు.

దీంతో సామ్ చైతూపై గెలిచింది అంటూ కథనాలు ట్రోల్ అవుతున్నాయి.అయితే ఇప్పుడే చైతూ బాలీవుఢ్ కెరీర్ స్టార్ట్ కాబట్టి ముందు ముందు మరిన్ని సినిమాలతో ఆకట్టు కోవచ్చు అని మరింత మంది అంటున్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement