ఆ సినిమా హిట్ తో సమంతకు చెక్‌.. కీర్తి సురేష్‌ ఫుల్‌ ఎటాక్‌ మూడ్‌

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత శాకుంతలం( Sakunthalam ) సినిమా తో సక్సెస్ అయితే వరుసగా పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేయాలని భావిస్తోంది.

కీర్తి సురేష్ మహానటి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన మహానటి తర్వాత కీర్తి సురేష్ చాలా సినిమాలు చేసింది.కానీ ఇప్పటి వరకు ఆ రేంజ్ లో కీర్తి సురేష్( Keerthy Suresh ) సక్సెస్ ను దక్కించుకోలేదు.

తాజాగా దసరా సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.పాన్ ఇండియా స్థాయిలో కీర్తి సురేష్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సమంత ఒక వైపు శాకుంతలం సినిమా తో సక్సెస్ అయి పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలని ఆశ పడింది.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కీర్తి సురేష్ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

అన్ని అనుకున్నట్లుగా జరిగితే సమంత( Samantha ) తో సినిమాను చేయాలనుకున్న ఒక నిర్మాత ఇప్పుడు కీర్తి సురేష్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

సమంత మరియు కీర్తి సురేష్ లు పోటీ పడి మరీ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక నుండి వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో వీరిద్దరి ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే భారీ ఎత్తున సినిమా ఇండస్ట్రీలో వీరికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌ లు మొదలు కాబోతున్నాయి.సమంత వరుస సినిమాలు చేయాలని భావిస్తున్న సమయంలో దసరా( Dussehra ) సినిమా హిట్‌ అవ్వడంతో కీర్తి సురేష్ ఫుల్‌ ఎటాక్ మూడ్‌ తో దూసుకు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆకట్టుకునే కథ మరియు కథనాలతో వీరిద్దరు సినిమాలు ఎంపిక చేసుకుంటారనే అభిప్రాయం ఉంది.శాకుంతలం సినిమా సక్సెస్ అయితే కనుక ముందు ముందు భారీ సినిమా లను సమంత చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

కీర్తి సురేష్ కూడా ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్ సినిమాలు మరియు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు