జయలలిత అక్రమార్జన కేసులో స్వాధీనం చేసుకున్న చరాస్తుల విక్రయం

అక్రమార్జన కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తులను విక్రయించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించింది.

1996 వ సంవత్సరం నాటి అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సాక్ష్యాల రూపంలో జయలలిత నివాసం నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో 11 వేలకు పైగా చీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలతో పాటు 7 కిలోల బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి.వీటిని కర్ణాటక సర్కార్ అమ్మకానికి పెట్టనుంది.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు