గాయంతో పోరాడుతున్నాను... సర్జరీ తర్వాత ఎమోషనల్ ట్వీట్ చేసిన ప్రభాస్ విలన్?

ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ( pruthvi Raj Sukumaaran ) సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.

ఈ ప్రమాదంలో ఈయన కాలికి గాయం కావడంతో డాక్టర్లు ఈయనకు సర్జరీ నిర్వహించారు.

ఇలా సర్జరీ తర్వాత మొదటిసారి నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వివరించారు.మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన విలయత్ బుద్ధ ( Vilayath Budda )అనే సినిమా షూటింగ్లో భాగంగా జారి కింద పడటంతో కాలికి పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది.

వెంటనే ఈయనను హాస్పిటల్ కి తరలించడంతో పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలనీ తెలియజేశారు.అయితే ఇతనికి సర్జరీ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది.ఇలా సర్జరీ( Surgery ) తర్వాత మొదటిసారి నటుడు పృథ్విరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేయడమే కాకుండా ప్రస్తుత తన పరిస్థితి గురించి కూడా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ తనకు ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని తెలియజేశారు.

Advertisement

యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి ( Accident ) గురయ్యానని అదృష్టవశాత్తు నిపుణుల పర్యవేక్షణలో తనకు సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందని తెలియజేశారు.సర్జరీ అనంతరం మూడు నెలల పాటు విశ్రాంతి అవసరమని, మరోవైపు ఫిజియోథెరపీ కూడా జరుగుతుందని ఈయన తెలియజేశారు.ప్రస్తుతం అయితే నొప్పితో పోరాడుతున్నానని సాధ్యమైనంత తొందరగా తిరిగి మీ ముందుకు వస్తానని ఈయన తెలిపారు.

నేను ప్రమాదానికి గురయ్యాననే విషయం తెలియడంతో ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా నాపై ప్రేమను వ్యక్తపరిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈయన ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న సలార్( Salar ) సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు