Salaar Movie : ప్రభాస్ అభిమానుల కోసం సలార్ షర్ట్ లు.. ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Salaar T Shirt Released Hombale Films-TeluguStop.com

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రబాస్ అదే ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో సలార్ సినిమా కూడా ఒకటి.

ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Telugu Salaar, Hombale, Shruti Haasan, Tollywood-Movie

ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే డార్లింగ్ అభిమానులు డిసెంబర్ 22 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.త్వరలోనే విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టి మనలో ఉన్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ విడుదల అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా సలార్ టీమ్ ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. ప్రభాస్ ఆటిట్యూడ్ హీరోయిజంతో పాటు ప్రభాస్ ని స్టైల్ ని ఇష్టపడే వారు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

Telugu Salaar, Hombale, Shruti Haasan, Tollywood-Movie

అయితే సలార్ సినిమా ( Salaar movie )కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం టీ షర్ట్స్( T shirts ) అందుబాటులోకి వచ్చాయి.సలార్ పేరు రాసి ఉన్న షర్ట్స్ రక రకాల కలర్స్ లో లభ్యమవుతున్నయి.499 రూపాయిల నుంచి 1499 రూపాయిల దాకా ఆ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి.ప్రభాస్ అభిమానులు హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.

అలాగే టీ షర్ట్స్ తో పాటు హుడి ,హార్మ్ స్లీవ్స్ ని కూడా ఆ సైట్ నుంచి పొందవచ్చు.డిసెంబర్ 22 దగ్గరపడే కొద్దీ మూవీ మేకర్స్ సలార్ ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.

అందులో భాగంగా మొదట భారీ ఎత్తున ఒక భారీ ఈవెంట్ ని జరపబోతున్నారు.అలాగే ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్ లు కూడా జరగనున్నాయి.

వాటితో పాటుగా ప్రభాస్ అన్ని బాషల మీడియా ప్రతినిధులతో మాట్లాడతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube