తెలంగాణ మంత్రుల విమర్శలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.తమది అభివృద్ధి అజెండా అన్న ఆయన ఎవరి ట్రాప్ లో పడమని చెప్పారు.
తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు అక్కడికే పరిమితమని తెలిపారు.ఏపీకి, తెలగాణ రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.
ఇటీవల ఏపీపై పలువురు తెలంగాణ మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అదేవిధంగా చంద్రబాబు, పవన్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏడ్చి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తే లాభం లేదన్నారు.చంద్రబాబు తన భార్యను తానే అవమానపర్చుకున్నారని తెలిపారు.
చంద్రబాబు ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు.కానీ గతంలోనే ప్రజలు ఆయనకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారని వెల్లడించారు.
తనపై ఆరోపణలు చేసే పవన్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యనించారు.