అంబటి రాయుడు వైసీపీ పార్టీ వీడటంపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ ( YCP )పార్టీలో జాయిన్ అయ్యి వారం రోజులు గడవక ముందే క్రికెటర్ అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే.

ఈరోజు ఉదయమే వైసీపీ పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాదు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కూడా వెల్లడించారు.

వైసీపీలో అంబటి రాయుడు( Ambati Rayudu ) జాయిన్ అయిన సమయంలో.జరగబోయే ఎన్నికలలో గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

అంతేకాకుండా పలు వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వైఎస్ జగన్ ని రాయుడు పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisement

అయితే అనూహ్యంగా పార్టీలో జాయిన్ అయి వారం రోజులు గడవక ముందే రాజీనామా చేయటం.ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.ఈ పరిణామంపై ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) స్పందించారు.

శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అంబటి రాయుడు వచ్చిందే నిన్ననో మొన్ననో.ఏ కారణంగా పార్టీలో జాయిన్ అయ్యారో.ఎందుకు పార్టీని విడి వెళ్లిపోయారో.

తెలియదు.పార్టీలోకి అభిమానంతో వచ్చానన్నారు.

ఆయన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ లో కొద్దిరోజులు.రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా అని చెప్పారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
నామినేటెడ్ పదవుల భర్తీ లో చంద్రబాబు తాజా నిర్ణయం ఏంటి ?

అలా ఎందుకు అన్నారో కారణాలు తెలియాలి.ఆ తర్వాత ఏమైనా మాట్లాడగలుగుతాం అని సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

Advertisement

తాజా వార్తలు