2024 ఎన్నికలలో వైసీపీ ( YCP )ఘోరంగా ఓడిపోయింది.ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలకి వాస్తవ ఫలితాలకి.
పొంతన లేకుండా పోయింది.ఈ ఎన్నికలలో కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.
రాయలసీమలో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.ఎన్నికలలో ఎనిమిది జిల్లాలలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
పరిస్థితి ఇలా ఉండగా ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) రాజీనామా చేశారు.వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.జరిగిన ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు.
ఎన్నికల ఫలితాలు అనంతరం నిన్నటి ఇప్పటి వరకు జగన్( Jagan ) ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవికి రాజీనామా చేయడం జరిగింది.ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి రావడంతో జూన్ 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అమరావతిలో జరగనున్న ఈ కార్యక్రమానికి మోదీ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.2019 ఎన్నికలలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయింది.కేవలం 23 స్థానాలకే పరిమితమైంది.
కానీ తాజాగా జరిగిన ఎన్నికలలో ఒక తెలుగుదేశం పార్టీకి 130కి పైగా స్థానాలలో గెలవడం జరిగింది.చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది.