రానా హీరోగా నీది నాది ఒకే కథ సినిమా దర్శకుడు వేణు ఊడుగుల డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా విరాటపర్వం.రానా తో పాటుగా సాయి పల్లవి స్కిరీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
ముందు జూలై 1న రిలీజ్ అనుకున్న ఈ సినిమా జూన్ 17కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఇదిలాఉంటే ఈ సినిమా భారం మొత్తం సాయి పల్లవి మీద ఉంచారని తెలుస్తుంది.
తెలుగులో సాయి పల్లవి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ.తను చేసే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాయి పల్లవి సినిమా అంటే ఆడియెన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.ఇక కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ ఎలాంటి బజ్ లేకుండా వస్తున్న విరాటపర్వం సినిమాకు సాయి పల్లవి తోనే క్రేజ్ ఏర్పడేలా చేస్తున్నారు.
అందుకే సాధారణంగా ఏ సినిమాకు హీరోయిన్ పేరుని సినిమా పోస్టర్ లో వేయరు.కానీ సాయి పల్లవి క్రేజ్ దృష్ట్యా ఆమె పేరుని కూడా పోస్టర్స్ లో వేస్తున్నారు.
మరి భారం అంతా సాయి పల్లవి మీద వేస్తున్నారు.సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.







