విరాటపర్వం దెబ్బకు ఆమెకు మళ్లీనా..?

టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాయి పల్లవి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సాయి పల్లవి, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా లవ్‌స్టోరి చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తోంది.అయితే దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది.

Sai Pallavi Next To Be Period Drama, Sai Pallavi, Virataparvam, Venu Udugula, To

అయితే ఈ సినిమా తరువాత మరోసారి పీరియాడికల్ డ్రామా మూవీలో నటించేందుకు సాయి పల్లవి రెడీ అవుతుంది.ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

కాగా ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటిస్తుందా, విరాటపర్వం తరువాత మరోసారి పీరియాడికల్ మూవీలో ఆమె నటించేందుకు ఒప్పుకుంటుందా అనేది ప్రస్తుతం సందేహంగా మారింది.

Advertisement

కాగా విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తోండగా రానా దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు