రైతు బంధు రగడ.. ఎవరికి ముప్పు ?

తెలంగాణలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ కు అన్నీ వైపులా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.

ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు ఇప్పటికే పార్టీని ఇరుకున పెట్టేలా ఉంటే ఇప్పుడు రైతు బంధు విషయంలో రగులుకున్న రగడ బి‌ఆర్‌ఎస్ కు మరింత చిక్కులు తెచ్చిపెట్టింది.ఎన్నికల ముందు రైతు బంధు నిధులు జమ చేయాయడానికి ఈసీ అనుమతి ఇచ్చినప్పటికి ఊహించని విధంగా ఆ అనుమతిని వెనక్కి తీసుకుంది.

రైతు బంధు ( Rythu Bandhu )నిధులు ఇప్పుడు జమ చేసే ఓటర్ల ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన ఎన్నికల కమిషన్ రైతుబంధు బ్రేక్ వేసింది.

Rythu Bandhu Break Whose Plan, Rythu Bandhu , Congress, Brs , Ts Elections, Cm K

ఈ పరిణామం బి‌ఆర్‌ఎస్‌ గట్టి దెబ్బే.అయితే రైతు బంధు ఆగిపోయినప్పటికి.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తామని కాంగ్రెస్( Congress ) నేతలు చెబుతున్నారు.

Advertisement
Rythu Bandhu Break Whose Plan, Rythu Bandhu , Congress, BRS , Ts Elections, Cm K

కానీ అటు వైపు బి‌ఆర్‌ఎస్ చెబుతున్న దాని ప్రకారం పిఎం కిషన్ నిధుల విడుదల జరిగినప్పుడు రైతు బంధును మాత్రమే ఎందుకు అపుతున్నారని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం బయట పడుతోందని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

Rythu Bandhu Break Whose Plan, Rythu Bandhu , Congress, Brs , Ts Elections, Cm K

ఇటీవల రైతు బంధు పథకాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చెప్పడం, మొదట పర్మిషన్ ఇచ్చిన ఈసీ ఇప్పుడు అనుమతికి నిరాకరించడం వంటివి చూస్తే బీజేపీ కాంగ్రెస్ కలిసి రాజకీయం చేస్తున్నాయనేది బి‌ఆర్‌ఎస్ నుంచి వినిప్శితున్న మాట.ఇకపోతే ప్రస్తుత పరిణామాలన్ని బి‌ఆర్‌ఎస్ కు ప్రతికూలంగా మారుతుండడం గమనార్హం.ఇప్పటికే కాంగ్రెస్ మరియు బీజేపీ చేస్తున్న విమర్శలు బి‌ఆర్‌ఎస్ ను తీవ్రంగా బాధిస్తున్నాయి.

ఈ విమర్శలకు చెక్ పెట్టడంలో కూడా బి‌ఆర్‌ఎస్ తడబడుతూనే ఉంది.ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉపయోగ పడే రైతు బంధు వంటి పథకాలకు కూడా బ్రేక్ పడడంతో బి‌ఆర్‌ఎస్ ను ఇబ్బందే అనే టాక్ వినిపిస్తోంది.

మరి ఈ ప్రతికూల పరిస్థితులు బి‌ఆర్‌ఎస్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు