మిమ్మల్ని వదిలేదే లేదు.. బ్రిటన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్యా

Russia Ex President Dmitri Medvedev Warns Britain Amid War With Ukraine Details, Russia Ex President ,dmitri Medvedev ,britain ,war ,ukraine, Putin, Uk Pm Rishi Sunak, Medvedev, Russia Ukraine War,

ఉక్రెయిన్‌పై( Ukraine ) ఇప్పటికే రష్యా ( Russia ) యుద్దాన్ని కొనసాగిస్తోంది.కొద్దినెలలుగా నిర్విరామంగా ఈ భీకర యుద్దం కొనసాగుతూనే ఉంది.

 Russia Ex President Dmitri Medvedev Warns Britain Amid War With Ukraine Details,-TeluguStop.com

యుద్దం ప్రభావానికి రెండు దేశాలు కూడా నష్టపోతున్నాయి.ఆస్తి, ప్రాణ నష్టం జరగడంతో తీవ్ర నష్టాన్ని మూటకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలో తాజాగా బ్రిటన్‌కు ( Britain ) రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్( Medvedev ) హెచ్చరికలు జారీ చేశారు.రష్యాకు ప్రస్తుతం సైనిక హెడ్ గా మెద్వదేవ్ వ్యవహరిస్తున్నారు.

యుద్దాలకు సంబంధించి పుతిన్ దగ్గర వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు.

Telugu Britain, Dmitri Medvedev, Medvedev, Putin, Russia, Ukraine-Telugu NRI

ఉక్రెయిన్‌కు అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై జరుగుతున్న యుద్దంలో సాయం చేస్తోన్నాయి.యుద్ద ట్యాంకులతో పాటు పరికరాలను సరఫరా చేస్తోన్నాయి.బ్రిటన్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు రష్యా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

దీంతో ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్న బ్రిటన్ కు రష్యా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.తెరముందు అమెరికా కనిపిస్తుండగా.తెరవెనుక బ్రిటన్ ఉండి ఉక్రెయిన్ ను నడిపిస్తుంది.దీంతో త్వరలో బ్రిటన్ మీద దాడి చేస్తామని రష్యా హెచ్చరించింది.

Telugu Britain, Dmitri Medvedev, Medvedev, Putin, Russia, Ukraine-Telugu NRI

అణు దాడి కూడా చేస్తామని రష్యా బ్రిటన్ ను భయపెడుతోంది.బ్రిటన్ తో పాటు ప్రపంచదేశాలను కూడా రష్యా భయపెడుతోంది.దీంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.అణు దాడి చేస్తామనే హెచ్చరికలతో చాలా దేశాలు రష్యాపై ఆగ్రహంతో ఉన్నాయి.రష్యా తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇప్పటికే జపాన్, హిరోషిమాపై అమెరికా చేసిన దాడులు, అనుబాంబులతో విధ్వంసం చెలరేగింది.

దాని నుంచి కోలుకోవడానికి జపాన్ కు చాలా సమయం పట్టింది.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అణు బాంబులు వేస్తామని రష్యా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తుండటంతో.ఆ దేశంపై వ్యతిరేకత వస్తోంది.

ఇప్పుడే చాాలా దేశాలు రష్యా తీరును ఎండగడుతున్నాయి.రష్యాతో పలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube