Prabhas: హీరో ప్రభాస్ జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు కొన్నారా.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ప్రభాస్ కు రెమ్యునరేషన్ల ద్వారా ఏకంగా 500 కోట్ల రూపాయలు దక్కినట్టు సమాచారం అందుతోంది.

అయితే ప్రభాస్ జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచారం చేసింది.ఆ వెబ్ సైట్ కేవలం కోటి రూపాయల 5 లక్షలకే ప్రభాస్ 84 ఎకరాలు కొనుగోలు చేసినట్టు పేర్కొంది.

జూబ్లీహిల్స్ లో ఎకరా స్థలం విలువ ఎంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియనిది కాదు.ప్రభాస్ కు 84 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని ఆ వెబ్ సైట్ ప్రచురించిన కథనంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ విలువ 60 కోట్ల రూపాయలు అని వెబ్ సైట్ పేర్కొంది.అయితే వైరల్ అయిన వార్తల గురించి ఈ కథనం గురించి ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందించడం గమనార్హం.

Advertisement

వైరల్ అవుతున్న వార్త నిజమా అంటూ శోభు యార్లగడ్డ సెటైర్లు వేయడంతో పాటు జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు అంటే దాని విలువ ఎంతో మీకు తెలుసా? అంటూ శోభు యార్లగడ్డ ప్రశ్నించారు.

చెత్త వార్తలు రాసి ఆ వార్తలకు సెలబ్రిటీల పేర్లను వాడటం అలవాటైపోయిందని ఆయన పేర్కొన్నారు.శోభు యార్లగడ్డ కామెంట్ల గురించి ఆ వెబ్ సైట్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.ప్రభాస్ ఈ తరహా వార్తల గురించి పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలైతే స్టార్ హీరో ప్రభాస్ మార్కెట్ రెట్టింపు కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు