సలార్ సినిమా ఆ సినిమాకు రీమేకా.. ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా భారీ షాక్ అంటూ?

ప్రభాస్ ప్రశాంత్ నీల్( Prabhas Prashanth Neel ) కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ మరోమారు వార్తలు తెరపైకి వస్తున్నాయి.గతంలో రవి బస్రూర్ ఒక సందర్భంలో సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

 Rumours Goes Viral About Salaar Movie Remake Details Here Goes Viral In Social M-TeluguStop.com

సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా డిసెంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Salaar, Kannada, Prabhas, Prashanth Neel, Ravi Basrur, Ugramm-Movie

రవి బస్రూర్( Ravi Basrur ) ఏ సందర్భంలో సలార్ గురించి ఈ కామెంట్లు చేశారో క్లారిటీ లేదు.అయితే సలార్( Salaar ) టీమ్ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కన్నడలో ఉగ్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమాను రీమేక్ చేయాల్సిన అవసరం ప్రశాంత్ నీల్ కు ఏముందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉగ్రం సినిమా( Ugramm Movie ) ఇప్పటికే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.యూట్యూబ్ లో ఈ సినిమా 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

సలార్ టీం ఈ ప్రచారం విషయంలో సైలెంట్ గా ఉంటే మాత్రం ఇబ్బందేనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.సలార్ రూమర్లకు వేగంగా చెక్ పెడితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Telugu Salaar, Kannada, Prabhas, Prashanth Neel, Ravi Basrur, Ugramm-Movie

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లన్నీ భారీ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.ప్రభాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube