ట్రైన్ సీక్వెన్స్‌తో అరిపించనున్న ఆర్ఆర్ఆర్

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Rrr Train Sequence To Be Highlight, Rrr, Rajamouli, Ntr, Ram Charan, Tollywood N-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఏర్పడ్డాయి.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో వావ్ అనిపించే సీక్వెన్స్‌లను జక్కన్న తనదైన స్టయిల్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సీక్వెన్స్‌లు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓ ట్రైన్ సీక్వెన్స్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలోని ఈ ట్రైన్ సీక్వెన్స్ యాక్షన్ పరంగా మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సీక్వెన్స్‌లో తారక్, చరణ్‌లు ఇద్దరూ కూడా అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి ట్రైన్ ఎపిసోడ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణగా మారనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మరి ఈ సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube