జక్కన్న కాకుండా ఉంటే ఫ్యాన్స్ వార్ ఏ రేంజ్ లో ఉండేదో?

టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే.

ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది.తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.దీంతో టీమ్ అంతా ఇన్ని రోజుల టెన్షన్ మరిచి హాయిగా రిలాక్స్ అయ్యారు.

Advertisement

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించాడు.అందరు ఊహించిన విధంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.

రిలీజ్ కు ముందే ట్రెండ్ వర్గాలు భారీ వసూళ్లను రాబడతాయని తెలిపారు.అలాగే రిలీజ్ తర్వాత అదే రేంజ్ లో వసూళ్లు రాబడుతుంది.

బాహుబలి రేంజ్ లో కాకపోయినా సూపర్ హిట్ అనే టాక్ అయితే తెచ్చుకుంది.

ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను జక్కన్న కలిపి ఒకేతాటి మీదకు తీసుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.ఇలా ఇద్దరు హీరోలను ఎలాంటి తప్పులు లేకుండా చూపించడం మాములు విషయం అయితే కాదు.ఏ మాత్రం తక్కువుగా చూపించిన ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాలలో కొట్టుకు పోవాల్సిందే.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

రిలీజ్ కు ముందు ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కాస్త గొడవలు పడిన కూడా రిలీజ్ తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు.ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇద్దరి ఫ్యాన్స్ సంతృప్తిగా ఉన్నారు.

Advertisement

ఒక హీరో ఎక్కువ మరొక హీరో తక్కువ కాకుండా జక్కన్న చూపించడంతో సైలెంట్ అయిపోయారు.లేదంటే ఫ్యాన్స్ వార్ మాములుగా ఉండేది కాదు.

కేవలం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తీయడం వల్ల ఎలాంటి గొడవలు జరగలేదు.మరొక డైరెక్టర్ అయి ఉంటే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా విమర్శలు చేసేవారు.ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా ఇద్దరు హీరోల తో చేస్తే ఎక్కడో ఒకచోట గందరగోళం జరిగిన నానా రభస చేసేవారు.

దీంతో రాజమౌళి బాగా బ్యాలెన్స్ చేసాడని అనుకుంటున్నారు.

తాజా వార్తలు