పిగ్మెంటేషన్ దూర‌మై ముఖం తెల్ల‌గా మారాలంటే మినప గుళ్ళతో ఇలా చేయండి!

మిన‌ప గుళ్ళు.మినుములు నుంచి వీటిని త‌యారు చేస్తారు.

అత్య‌ధికంగా వినియోగించే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప గుళ్ళు ఒక‌టి.

మిన‌పు గుళ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు.

బోలెడ‌న్ని పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.అయితే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలోనూ మిన‌మ గుళ్ళు స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement
Round Urad Dal Helps To Get Rid Of Pigmentation And Improve Skin Tone Details! R

ముఖ్యంగా పిగ్మెంటేషన్ స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలోనూ, స్కిన్ టోన్ ను రెట్టింపు చేయ‌డంలోనూ మిన‌ప గుళ్ళు గ్రేట్‌గా హెల్ప్ చేస్తాయి.మ‌రి ఇంత‌కీ వీటిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల మిన‌ప గుళ్ళును తీసుకుని ఒక‌సారి వాట‌ర్‌తో వాష్ చేయాలి.ఆ త‌ర్వాత అందులో ఒక చిన్న క‌ప్పు పాలు పోసి క‌లిపి నైట్‌ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే మిక్సీ జార్ తీసుకుని నాన‌బెట్టుకున్న మిన‌మ గుళ్ళ‌ను పాల‌తో స‌హా వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Round Urad Dal Helps To Get Rid Of Pigmentation And Improve Skin Tone Details R

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ సాయంతో ముఖానికి అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంత‌రం త‌డి వేళ్ల‌తో సున్నితంగా ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్ తో క్లీన్ చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

మిన‌ప గుళ్ళ‌తో ఈ విధంగా వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఫేస్ ప్యాక్ వేసుకుంటే పిగ్మంటేష‌న్ స‌మ‌స్య‌కు బై బై చెప్పొచ్చు.అదే స‌మ‌యంలో ముఖ చ‌ర్మం తెల్ల‌గా, కాంతివంతంగా కూడా మారుతుంది.

Advertisement

కాబ‌ట్టి, ఈ సింపుల్ రెమెడీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

తాజా వార్తలు