వెదురు బొంగులతో చేసిన రోలర్ కోస్టర్.. ఇండోనేషియా పిల్లల వీడియో వైరల్!

కొన్నిసార్లు సింపుల్ గా, మనసుకు హత్తుకునే మూమెంట్స్ నెటిజన్ల దృష్టిని ఇట్టే కట్టిపడేస్తాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రోజుల్లో ఇంతకంటే బెస్ట్ వీడియో ఇంకొకటి ఉండదంటూ అందరూ మురిసిపోతున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram)ఇప్పటికే 3.5 కోట్ల వ్యూస్‌ దాటేసిన ఈ వీడియోలో, ఇండోనేషియాలోని(indonesia) పిల్లలు వెదురు బొంగులతో చేసిన రోలర్ కోస్టర్‌పై(roller coaster) ఎంజాయ్ చేస్తున్నారు.కేవలం వెదురు కర్రలు, బొంగులతోనే ఓ రోలర్ కోస్టర్‌ని(roller coaster made of bamboo sticks and bamboo poles) తయారుచేశారు.

ఆ ఊయలలో ఊగుతూ అక్కడి పిల్లలు ఆనందంతో గంతులు వేశారు.ఈ వీడియో ఇండోనేషియాలోని మలాంగ్‌బాంగ్ అనే సిటీలో తీసింది.వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్‌లో "సెరు బాంగెట్" అని కామెంట్లు పెడుతున్నారు.

ఇండోనేషియన్ భాషలో "సెరు బాంగెట్" అంటే "చాలా సరదాగా ఉంది" అని అర్థం.పిల్లలు ఆ రైడ్‌లో ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.

Advertisement

ఈ వెదురు బొంగుల రోలర్ కోస్టర్‌ వెనుక ఉన్న క్రియేటివిటీకి ప్రపంచం ఫిదా అయిపోయింది. "సూపర్ ఎక్సైటింగ్, క్రియేటివ్" అంటూ ఒక యూజర్ కామెంట్ చేస్తే, ఇంకొకరు "పిల్లలు రోజంతా ఫోన్లతో ఆడుకునే దానికంటే ఇది చూడటానికి చాలా బాగుంది" అని రాసుకొచ్చారు.ఇలాంటి సింపుల్ రైడ్‌ని పిల్లల కోసం కష్టపడి తయారు చేసినందుకు చాలామంది అభినందించారు.

కొంతమంది కామెంట్లు పెడుతూ, ఈ రోలర్ కోస్టర్ తయారు చేసిన వ్యక్తి చాలా గొప్ప ఆలోచన కలవాడని, టాలెంటెడ్ అని పొగిడేశారు.ఒకరైతే, "సంతోషం కోసం ఖరీదైన వస్తువులు అక్కర్లేదు, కానీ దాన్ని క్రియేట్ చేయడానికి మాత్రం టాలెంట్ ఉండాలి" అని కామెంట్ పెట్టారు.మరొక యూజర్, "పిల్లల కోసం ఇంత మంచి పని చేసిన ఆ వ్యక్తి ఎంత దయగలవాడు" అని మెచ్చుకున్నారు.

ఇంకొక నెటిజన్ అయితే ఫన్నీగా "ఆ బాబ్ ది బిల్డర్‌కి ఒక సెల్యూట్" అంటూ కామెంట్ పెట్టాడు.ఖరీదైన గ్యాడ్జెట్స్ లేదా పెద్ద ఈవెంట్స్‌లోనే కాదు, కొన్నిసార్లు చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందం ఉంటుందని ఈ వీడియో మనకు గుర్తు చేస్తుంది.

ఒక క్రియేటివ్ ఐడియా, కొంచెం కష్టం, పిల్లలు నవ్వాలని ఒక చిన్న కోరిక ఉంటే చాలు.

న్యూస్ రౌండర్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు