Madhubala Roja Movie : రోజా సినిమా నా వల్లే హిట్ అయ్యింది అనే భ్రమలో ఉండేదాన్ని : మధుబాల

మణిరత్నం తీసిన రోజా సినిమా( Roja Movie ) ద్వారా మధుబాల( Madhubala ) హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది.ఈ సినిమా అప్పట్లో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.

 Roja Movie Heroine Madhubala About Her Relation With Maniratnam Details-TeluguStop.com

రోజా సినిమా అంటే అప్పట్లో ఒక క్లాసిక్ ట్రెండ్ సెట్టర్.ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది మధుబాల కి అలాగే అరవింద్ స్వామికి( Arvind Swamy ) ఫ్యాన్స్ అయిపోయారు.

అరవింద్ స్వామికి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగితే మధుబాల కి అబ్బాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఇలా ఈ సినిమా వారికి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా కూడా నిలిచిపోయింది.

అయితే ఓసారి ఒక ఇంటర్వ్యూలో మణిరత్నంతో ఆమెకు గల విభేదాల గురించి మధుబాల మాట్లాడారు.

Telugu Arvind Swamy, Maniratnam, Madhubala, Madhubalamani, Roja, Roja Madhubala-

మణిరత్నంతో( Maniratnam ) మరో సినిమాలో నటించకపోవడానికి గల కారణాలను చెబుతూ.మణి సార్ కి నాకు రోజా సినిమా తర్వాత దూరం ఏర్పడింది.అప్పట్లో ఉన్న ఆటిట్యూడ్ మరోలా ఉండేది.

ఎందుకంటే నేను ఆయనకు దొరికిన రోజాని అని, నా కష్టం నేను పడ్డాను అందులో ఆయన గొప్ప ఏముంది అని అనుకునేదాన్ని, ఆది చిన్న వయసు కాబట్టి ఎలా మాట్లాడాలో తెలిసేది కూడా కాదు.అందువల్ల రోజా కి నేను మాత్రమే సరైన నటిని అన్న భావనలో ఉండేదాన్ని.

కానీ ఆ తర్వాతే తెలిసింది ఆయన తలుచుకుంటే ప్రతి హీరోయిన్ లో రోజాన్ని వెతకగలరు.నాలో ఆ ఆటిట్యూడ్ పోయే లోపు కెరియర్ ముగిసిపోయింది.సెకండ్ ఇన్నింగ్స్ అయితే మొదలుపెట్టాను కానీ మళ్ళీ మణిరత్నం సినిమాలో నటించే అవకాశం దక్కలేదు.

Telugu Arvind Swamy, Maniratnam, Madhubala, Madhubalamani, Roja, Roja Madhubala-

రోజా తర్వాత కొన్నిసార్లు మణి సర్ ని రీచ్ అవ్వాలని ప్రయత్నించాను కానీ మణిరత్నం సార్ దగ్గర నుంచి నాకు ఎలాంటి రిప్లై దొరకలేదు.కలవాలని కూడా ప్రయత్నించాను కానీ అది కూడా సాధ్యం కాలేదు.కానీ ఎందుకో ఆయన నన్ను పక్కన పెట్టేశారు.

ఏది ఏమైనా నా ఆలోచన విధానం అప్పట్లో అలాగే ఉండేది.ఎందుకంటే నేను చాలా కష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను.

నా బట్టలు, నా హెయిర్, నా మేకప్ అన్ని నేనే చేసుకునేదాన్ని.ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉండేది.

నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండేవారు కాదు.దాని వల్ల నేను చాలా కష్టపడితేనే సినిమా బాగా వచ్చింది అనుకున్నాను.

ఇప్పటికీ అవకాశం ఉంటే మళ్లీ ఆయనతో నటించాలని ఉంది అంటూ మధుబాల చాలా రోజుల తర్వాత ఓపెన్ అయ్యారు.ఇక ఇటీవల శాకుంతలం సినిమాలో మేనక పాత్రలో మధుబాల నటించారు.

తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని కూడా చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube