టీ20 సిరీస్‌లో భాగంగా లక్నో, ధర్మశాల వేదికగా టీమ్ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి.ఈ రెండింటిలోనూ ఇండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ శర్మ సేన శ్రీలంక జట్టుపై విజయకేతనం ఎగురవేసింది.అయితే ఈ మ్యాచ్ ను గెలిపించిన రోహిత్ శర్మ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.
ఎందుకంటే రోహిత్ నాయకత్వంలో టీమిండియా స్వదేశంలో 17 మ్యాచ్‌లు ఆడగా 16 మ్యాచ్‌లు గెలిచింది.కేవలం ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది.
దీంతో హోమ్ టౌన్ లో జరిగిన టీ20ఐ మ్యాచ్‌ల్లో ఎక్కువసార్లు టీమ్‌ని గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు.
నిన్నటిదాకా మోర్గాన్ (ఇంగ్లాండ్), విలియమ్సన్ (న్యూజిలాండ్) స్వదేశంలో తమ జట్టును ఎక్కువసార్లు గెలిపించిన కెప్టెన్‌లుగా ఉన్నారు.
అయితే వారిద్దరినీ నెట్టేసి హిట్ మ్యాన్ ప్రథమ స్థానంలో నిలిచాడు.రోహిత్ శర్మ దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేయడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు.
మరో 18 పరుగులు చేస్తే టీ20ఐ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడు.
ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఆడిన టీ20ల్లో రోహిత్ అదిరిపోయే ఆటతో చెలరేగి 982 రన్స్ చేశాడు.నెక్స్ట్ మ్యాచ్‌లో మరో 18 పరుగులు సాధిస్తే 28 మ్యాచ్‌ల్లోనే 1000 పూర్తి చేసినట్లవుతుంది.అలాగే 30 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేసిన కోహ్లీ రికార్డును బ్రేక్ చేసినట్లు కూడా అవుతుంది.
నిజానికి ఇప్పటికే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాల్సి ఉంది.కానీ నిన్న జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు.అయినప్పటికీ ఇతర ప్లేయర్లు రాణించి శ్రీలంకను చిత్తు చేశారు.ఓవరాల్‌గా హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటి వరకు 27 టీ20ల్లో 24 మ్యాచ్‌లు గెలిచింది.