ఆస్ట్రేలియా టూర్ కి రోహిత్ అవుట్..! టీంను ప్రకటించిన బీసీసీఐ..!

ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ 13 వ సీజన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది.

అది ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత క్రీడాకారులు ఆస్ట్రేలియా దేశంలో జరిగే ఆస్ట్రేలియా టూర్ కు పయనం కానుంది.

ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా మూడు ఫార్మెట్స్ కు సంబంధించి ఆడబోయే భారత జట్టును ప్రకటించింది.అయితే ఈసారి బీసీసీఐ టీమిండియా జట్టులో కాస్త మార్పులను తీసుకు వచ్చింది.

ఇందులో భాగంగానే రోహిత్ శర్మ కు మూడు ఫార్మాట్స్ లో అతని ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని విశ్రాంతిని ఇచ్చింది.దీంతో వన్డే క్రికెట్ లో, అలాగే టి20 క్రికెట్ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించడం ఉండగా కె.ఎల్.రాహుల్ ని వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ.ఇక మరోవైపు టెస్టుల విషయానికి వస్తే కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉండగా వైస్ కెప్టెన్ గా అజింక్యా రహనే ను కొనసాగిస్తుంది బీసీసీఐ.

ఇకపోతే ఈసారి కొత్తగా టెస్ట్ టీం లో 5 వ ఫేసర్ గా హైదరాబాద్ స్టార్ బౌలర్ సిరాజ్ స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఇకపోతే ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని టి-20 టీంకి కొత్తగా సెలెక్ట్ చేసింది బీసీసీఐ.

Advertisement

ఇక టెస్ట్ కు సంబంధించి రోహిత్ శర్మ తో పాటు ఇషాంత్ శర్మ కూడా దూరమయ్యారు.ఇక ఈ పర్యటన నవంబర్ 27 నుంచి మొదలు కాబోతోంది.

ఇక వన్డే టి20 టెస్ట్ మ్యాచ్ లకు సంబంధించి టీం సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

టెస్టు జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, షమి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ ‌సిరాజ్‌.వన్డే జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌.టీ20 జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు