ఖమ్మం జిల్లా వైరాలో రోడ్డుప్రమాదం.. వృద్ధురాలికి తీవ్రగాయాలు

ఖమ్మం జిల్లా వైరాలో రోడ్డుప్రమాదం జరిగింది.బస్టాండ్ లో వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ క్రమంలో వృద్ధురాలి రెండు కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.వెంటనే గమనించిన స్థానికులు బాధితురాలిని సమీప ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే బాధితురాలు తల్లాడ మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement