ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి తెలియని వారెవరు లేరు.
ఈయన అప్పట్లో ఎంత మంచి సినిమాలు చేసి ఆకట్టు కున్నాడో ఇప్పుడు అంత ఘోరంగా సినిమాలు చేస్తున్నాడు.
ఒక్కటి కూడా ఆయన మార్క్ కనిపించడం లేదు.బోల్డ్ సినిమాలను తీస్తూ విమర్శల పాలు అవుతున్నారు.
మరి చాలా రోజుల తర్వాత వర్మ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈయన లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం.
( Vyuham Movie ) తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో టీజర్ మంచి మ్యాటర్ ఉన్నట్టే కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్( Jagan ) ఎదుర్కున్న సమస్యలు వాటిని ఎలా అధిగమించి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించు కున్నారు అనే అంశాలతో తెరకెక్కింది.
ఇక ఈ సినిమాలో చంద్రబాబు,( Chandrababu ) పవన్,( Pawan Kalyan ) సోనియా వంటి పాత్రలను పోలిన పాత్రలు ఉండగా నెగిటివ్ గా వారిని చూపించినట్టు వారంతా కలిసి కుట్ర చేస్తున్నట్టు టీజర్ లో చూపించారు.అలాగే జగన్ జైలు జీవితం, ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమా టీజర్ తో వీరందరిని టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది.మొత్తంగా ఈ సినిమా జగన్ ను హైలెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ చూపించిన సినిమాగా అనిపిస్తుంది.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా వైసీపీకి( YCP ) ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.ఇక ఈ సినిమాను వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మనసులు నటించారు.రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.2024 ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy