మహేష్ కి క్లాస్ పీకిన రామ్ గోపాల్ వర్మ

సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ మీద జోకులు వేసి పవన్ ఫ్యాన్స్ ని ఆడుకున్న రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మహేష్ బాబు మీద పడ్డారు.

బ్రహ్మోత్సవం సినిమా వైఫల్యాన్ని చూపిస్తూ మహేష్ బాబుకి ట్విట్టర్ క్లాస్ పీకినంత పని చేసారు.

"నాకు ఉత్సవం లాంటి వార్త ఏమిటంటే, ఇకనుంచి ఫ్యామిలి సినిమాలు తీయడం మానేస్తారు.ఇప్పుడు నేను బ్రహ్మ దేవుడి ముఖం చూడాలనుకుంటున్నాను " అంటూ మొదలుపెట్టిన వర్మ, బాలత్రిపురమణి పాటలో మహేష్ చేత వేయించిన స్టెప్స్ ని ఎగతాళి చేసారు.

మనుషులు మంచొళ్ళు, అందరు కలిసి ఉండాలి అంటూ బ్రహ్మోత్సవం చెబితే, సహజంగా ఫ్యామిలి సినిమా తీస్తే, తండ్రి హీరోయిన్ అందాలతో బిజిగా ఉంటాడని, తల్లి బట్టలతో, చెల్లి బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ బిజీగా ఉంటారని, ఇక బోర్ కొడుతున్న కొడుకు పడుకుంటాడని, తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో జోకులేసారు వర్మ." మహేష్ బాబు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రేక్షకులు థియేటర్లో కూర్చునేది పోకిరి,ఒక్కడు, బిజినెస్ మెన్ లాంటి సినిమాలు చూడడానికే.

ఫ్యామిలి సినిమా హిట్ అయినా మహా అయితే శోభన్ బాబులా తయారవుతారు కాని, కృష్ణ, ఎన్టీఆర్ లా మారలేరు.దేవత సినిమాలో మంచి కథ ఉందన్న విషయం గుర్తుంది కాని, అందులో శోభన్ బాబు గుర్తులేడు.

Advertisement

ఏజెంట్ గోపి, అడవిరాముడు చిత్రాల్లో కథ గుర్తులేదు కాని, కృష్ణ, ఎన్టీఆర్ గుర్తున్నారు.మహేష్ తెలుసుకోవాలి, తన సూపర్ స్టార్ డమ్, అర్డినరి ఫ్యామిలి సినిమాల కంటే, చాలా అంటే చాలా పెద్దదని" అంటూ మహేష్ కి హితబోధ చేసారు రామ్ గోపాల్ వర్మ.

వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా
Advertisement

తాజా వార్తలు