విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూస్తున్నారు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు?

బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.

విజయ్ దేవరకొండ సినిమాలకు హిట్ టాక్ వస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అనే సంగతి తెలిసిందే.

లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.ఈ సినిమాకు జరిగిన బిజినెస్ లో మూడో వంతు కూడా కలెక్షన్లు రాలేదు.

ఈ సినిమాను నమ్మి కళ్లు చెదిరే రేట్లకు హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు నిండా మునిగిపోయారు.విజయ్ దేవరకొండ సైతం లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తర్వాత ఆ సినిమా ఫలితం గురించి స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదనే సంగతి తెలిసిందే.

అయితే విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూస్తున్నారంటూ తాజాగా ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ అర్జున్ రెడ్డి సినిమా సమయం నుంచి విజయ్ దేవరకొండ అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడని అన్నారు.

Advertisement
Rgv Sensational Comments About Vijay Devarakonda Details Here Goes Viral , Rgv,

లైగర్ మూవీతో విజయ్ కు ఆ ఆటిట్యూడ్ రాలేదని కొత్తగా లైగర్ సమయంలో విజయ్ దేవరకొండ ఏం మాట్లాడలేదని ఆర్జీవీ తెలిపారు.ఆటిట్యూడ్ వల్లే విజయ్ స్టార్ అయ్యారని లైగర్ సినిమా సమయంలో మాత్రం విజయ్ కు బ్యాడ్ టైమ్ మొదలైందని ఆర్జీవీ కామెంట్లు చేశారు.

Rgv Sensational Comments About Vijay Devarakonda Details Here Goes Viral , Rgv,

విజయ్ తన మాటల వల్ల హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదని ఆర్జీవీ అన్నారు.ఒక హీరో ఎదుగుతున్నాడంటే ఇతర హీరోలు జెలసీగా ఫీలవుతారని వర్మ కామెంట్లు చేశారు.ఎదిగే హీరోను తొక్కేయడం సినిమా రంగంలో ఎప్పటినుంచో ఉందని వర్మ చెప్పుకొచ్చారు.

ఒక హీరో అంటే మరో హీరోకు పడదని లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని వర్మ కామెంట్లు చేశారు.విజయ్ వల్లే లైగర్ ఫ్లాప్ కాలేదని ఆయన అన్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు