టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు చర్ఛనీయాంశమవుతున్నాయి.టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేతలను టార్గెట్ చేస్తూ వచ్చిన విషయం విధితమే.
ఇక టీఆర్ఎస్‌పై ఎలా విరుచుకుపడ్డాడో చెప్పాల్సిన పనిలేదు.అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణకు చెందిన కొందరి అధికారులను టార్గెట్ చేయడం, వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకిత్తిస్తోంది.
రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్నవారంతా బీహారీలే అంటూ నూతన చర్చకు తెర తీశారు.సీఎం కేసీఆర్ థింక్ ట్యాంక్‌గా అభిర్ణించే సీఎస్ మొదలుకొని ఆయనకు అత్యంత సన్నిహుతుడు కేసీఆర్ థింక్ ట్యాంక్ గా అభివర్ణించే సీఎస్ మొదలు.
ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వారిలో ఎక్కువంది బీహారీలే ఉన్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తన ఎన్నికల వ్యూహకర్తగా బీహారీకి చెందిన ప్రశాంత్‌కిషోర్‌ను ఎంపిక చేసుకోవడం, దీనిపై రేవంత్ మాట్లాడడం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే రేవంత్ వ్యాఖ్యలను చూస్తే కేసీఆర్ కోర్ టీంను డిఫెన్స్‌లోమ పడేయడానికేనని అర్థమవుతోంది.సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చే అధికారుల మూలాలను ప్రస్తావిస్తే సీనియర్ నాయకుల మనసులు దోచుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు కనిపిస్తోంది.స్వరాష్ట్రంలో స్థానిక అధికారులు పరాయి వారి పట్ల అంతర్గతంగా మండిపోతున్నట్టు సమాచారం.సీఎం కేసీఆర్ సరైన ప్రాధాన్యత తమకు ఇవ్వట్లేదనే భావనలో ఉన్నారని, వారికి దగ్గరయ్యేందుకే రేవంత్ ఇలా అధికారులపై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
అయితే స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించిన కేసీఆర్‌ను నాడు సీనియర్ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.దీంతో కేసీఆర్ అలాంటి వారిపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చేవారు.దీంతో వారు దెబ్బకు దారికొచ్చారు.ప్రస్తుతం ఇదే విధానాన్ని రేవంత్‌రెడ్డి అమలుచేస్తున్నట్టు సమాచారం.
కాగా తెలంగాణోద్యమ సమయంలో ఉన్న పరిస్థితులు.నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది.అయినప్పటికీ రేవంత్ నోటి వెంట బీహార్ మాట వ్యూహాత్మకమేనని రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వ్యాఖ్యలు రేవంత్‌కు ఎంత మేర లాభం చేకూరుస్తుందోన్న విషయాన్ని పక్కన బెడితే కొత్త చిక్కులు వచ్చి పడతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఢీకొట్టేందుకు రేవంత్ సన్నద్ధంగా ఉన్నడనే మరో వాదన కూడా వినిపిస్తోంది.రానురాను రేవంత్ నోట వచ్చిన బీహార్ మాటలు దేనికి దారితీస్తాయో వేచి చూడాల్సిందే.