మొన్నటి వరకు ఒక విధమైన రాజకీయాలు జరిగిన తెలంగాణలో ఇప్పడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని మరో పుంతలు తొక్కుతున్నాయి.ఇక ఇప్పటకే రేవంత్ రాకతో మంచి జోరు మీద కనిపిస్తున్న కాంగ్రెస్ అధికార టీఆర్ ఎస్‌తో పాటు బీజేపీలోనూ కలకలం రేపుతోంది.
ఎందుకంటే రేవంత్ రెడ్డికి గతంలో టీడీపీ నాయకులుగా అనేక మంది టచ్ లో ఉన్నారు.దీంతో ఆయన ఆయా పార్టీల్లోని తనకు సన్నిహితంగా ఉన్న వారిని మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్ కంటే బీజేపీకే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది.
ఎందుకంటే బీజేపీలో చేరిన పాత టీడీపీ నేతలందరినీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తూ కాంగ్రెస్‌లోకి వెళ్లే విధంగా గాలం వేస్తున్నారని తెలుస్తోంది.
ఏ మాత్రం మొహమాట పడకుండా వారిని కలుస్తూ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నాడట.బీజేపీలోని అసంతృప్త నేతలందరికీ రేవంత్ గాలం వేయడంతో ఆ పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటోందంట.
ఇక ఇందులో వర్గ పోరు కూడా తక్కువేమీ కాకపోవడంతో నాకేందంటే నాకేందన్నట్టు అందరూ మౌనంగా ఉండటంతో రేవంత్ ఎంచక్కా తన పని తాను కానిచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇప్పడు రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కమల దళానికి నిజంగానే చమటలు పట్టిస్తున్నాయని తెలుస్తోంది.ఎందుకంటే డైరెక్టుగా బీజేపీ నేతల దూకుడును ఎదుర్కొంటే చాలా సమయం పడుతుందని భావించిన రేవంత్ వారిని మించి వెనుకాల నుంచి నరుక్కువస్తూ బీజేపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారంట.ఎందుకంటే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారంతా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు.
రీసెంట్ గానే పెద్దిరెడ్డితో పాటు చాడ సురేష్ రెడ్డి అలాగే బోడ జనార్ధన్ లాంటి మాజీ టీడీపీ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట.వీరిని కూడా రేవంత్ ఆహ్వానించడంతో వారు ఇప్పుడు బీజేపీని వీడేందుకు రెడీ అయ్యారు.