ట్రాక్ రికార్డు చూడమంటున్న రేవంత్

హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ( Congress party ) ట్రాక్ రికార్డు చూసి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు ,అర్హులకు పోడు భూముల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను హామీ ఇచ్చి విజయవంతంగా అమలు చేసిందని, ఇతర రాజకీయ పక్షాల లాగా అకౌంట్లో 15 లక్షలు వేస్తాం, దళితులను ముఖ్యమంత్రిని చేస్తాం, మూడు ఎకరాల భూమి ఉచితంగా ఇస్తాం లాంటి భూటకపు హామీలు కాంగ్రెస్ ఇవ్వదని, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ( Sonia Gandhi )ని గౌరవంగా ఆహ్వానించి ఉంటే బారాస ప్రతిష్ట కొంత పెరిగి ఉండేదని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని భాజపా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన గ్యాంగులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.

దశాబ్దాల పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అవమానించేలా మాట్లాడిన ప్రదానీ మోడీ ( Narendra Modi )వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉద్యమం విలువ తెలుసు కాబట్టే రాహుల్ గాంధీ మోడీ వ్యాఖ్యలను తప్పు పట్టారని ఆయన చెప్పుకొచ్చారు.బారాస ప్రభుత్వానికి ఇంకా 99 రోజులే ఆయుష్షు మిగిలి ఉందని 99 రోజుల తర్వాత ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ఆయన జోష్యం చెప్పారు.

భాజపా, ఎంఐఎం, బారాస అన్ని ఒకతానులో ముక్కలేనని వీరిలో ఎవరికి ఓటు వేసినా మోడీ గూటికే చేరుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ధరణి పోర్టల్ రద్దుకు కట్టుబడి ఉన్నామని ఈ పోర్టల్ కెసిఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందని ఆయన దుయ్యబట్టారు.ఇచ్చిన హామీల అమలు కోసం తాము ఇస్తున్న గ్యారెంటీ కార్డులను చూసి కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ,కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చి తీరుతామని ఆయన నొక్కి వక్కాణించారు .

Advertisement
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు