ఆ ఒక్క డైలాగ్ తో ' ఫలితం ' వచ్చినట్టేనా రేవంత్ ? 

తెలంగాణలో కాంగ్రెస్ ( Congress )ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు.

ప్రస్తుతం హాథ్ సే హత్ జోడో పాదయాత్ర చేపడుతున్న రేవంత్ ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నా.ఎన్నికల నాటికి అవన్నీ సర్దుమనుకుతాయని ఫలితాలు అనుకూలంగా వస్తాయని రేవంత్ ఆశలు పెట్టుకున్నారు .ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) అవినీతి వ్యవహారాల్లో మునిగితేలుతోందని,  బిజెపి పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని,  ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో రేవంత్ ఉన్నారు.

అందుకే ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న రేవంత్ ప్రజల వద్దకు వెళుతున్న సమయంలో స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు,  ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన స్పందిస్తూ బిజెపి నాయకుల అవినీతి వ్యవహారాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.దీంతోపాటు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ రేవంత్ కోరుతున్నారు.ఈ ఒక్క ఛాన్స్ డైలాగ్ రేవంత్ పదేపదే ఉపయోగిస్తుండడం తో ప్రజల్లోనూ ఆలోచన రెకెత్తడానికి  దోహదపడుతోంది.

రేవంత్ పాదయాత్రకు యువత నుంచి రెస్పాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.రేవంత్ తను పాదయాత్ర కంటే ముందుగానే ఆయా నియోజకవర్గ బిజెపి , కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై చార్జిషీట్ పేరుతో స్థానిక నాయకులతో మీడియా సమావేశం నిర్వహించే విధంగా తగిన సూచనలు చేస్తున్నారు.తన పాదయాత్ర సమయంలో ఆ అంశాలను ప్రస్తావిస్తూ , కాంగ్రెస్ వైపు ఓటర్లు చూపు పడేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

దీంతో పాటు ఒక్క ఛాన్స్ అంటూ పదేపదే తన పాదయాత్రలు ప్రస్తావిస్తూ జనాల ఆలోచనలో  మార్పు వచ్చే విధంగా,  కాంగ్రెస్ పై ఆదరణ పెరిగే విధంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు