అందుకే క్లాసిక్స్ ని టచ్ చేయకూడదు... ఎందుకంటే జరిగేది ఇదే!

సాధారణంగా ఒక సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి చిత్రాలను వేరొక భాషలో రిలీజ్ చేయడానికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు చాలా ట్రై చేస్తూ ఉంటారు.అయితే ఇది మొదటి నుండి ఉన్నదే.

 Result Of Touching Classic Movies ,om Movie , Shiva Rajkumar , Omkaram , Set-TeluguStop.com

ఎందుకంటే ఒక భాషలో రూపొంది, సూపర్ హిట్ అయిన చిత్రం మరొక భాషలో కూడా ఆడుతుందని నమ్ముతారు.అంతవరకు నిజమే కానీ, కొన్ని క్లాసిక్స్ చిత్రాలకు మాత్రం ఈ లాజిక్ వర్తించదు.

ఒక ఒరిజినల్ సినిమానే తీసుకుని ఎన్ని భాషల్లో రీమేక్ చేసినప్పటికీ, అది ఒరిజినల్ అనిపించుకోకపోగా, అసలు ఈ సినిమాని వీళ్లు ఎందుకు చెడగొట్టారు రా బాబు! అని అనిపించేలా తెరకెక్కిస్తూ ఉంటారు.అయితే అది వాళ్ళ తప్పు కాదు.

ఒక్కో కంటెంట్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటూ ఉంటుంది.అలాంటి వాటిని టచ్ చేయకపోవడం ఉత్తమం… లేదంటే సదరు ఫిల్ మేకర్స్ అభాసుపాలు అవ్వక తప్పదు.

Telugu Om, Omkaram, Rajasekhar, Ram Charan, Sethu, Shiva Rajkumar, Thoofan-Movie

అలాంటి సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ముందుగా కన్నడ సినిమా….కన్నడ కంఠీరవ శివరాజ్ కుమార్ హీరోగా చేసిన “ఓం” అనే సినిమా( Om Movie ) గురించి మాట్లాడుకోవాలి.ఈ సినిమా కన్నడలో శివరాజ్ కుమార్( Shiva Rajkumar ) ని మంచి నటుడిగా నిలబెట్టిన సినిమా.ఈ సినిమాలోని పాత్ర శివన్న కోసమే పుట్టినట్టు సృష్టించబడి ఉంటుంది.

దాంతో అప్పట్లోనే ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసి, మిగతా సినిమా పరిశ్రమలు ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి.ఈ నేపథ్యంలోనే తెలుగులో హీరో రాజశేఖర్ ఓంకారం( Omkaram ) పేరుతో ఆ సినిమాను రీమేక్ చేశారు.

కానీ తెలుగులో ఓంకారం సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలింది.

Telugu Om, Omkaram, Rajasekhar, Ram Charan, Sethu, Shiva Rajkumar, Thoofan-Movie

ఇక ఇదే కోవకి చెందుతుంది తమిళంలో విక్రమ్ నటించిన “సేతు” సినిమా( SETHU ) ఈ సినిమా విక్రమ్ కెరీర్ కి తమిళంలో బాసటగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇక ఈ సినిమాని కూడా తెలుగులో హీరో రాజశేఖర్ శేషు అనే పేరుతో రీమేక్ చేయగా మరలా ఈ సినిమా ప్లాప్ అయింది.అయితే ఆ వెంటనే కన్నడలో ఈ సినిమాని కిచ్చ సుదీప్ రీమేక్ చేయగా, ఒరిజినల్ సినిమా కంటే కూడా గొప్పగా ఆడింది.

ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో రూపొందిన షేర్ సేతు అనే సినిమా దాదాపు మూడు భాషల్లో రీమేక్ అయింది.ఒక్క కన్నడ భాషలో తప్పితే మిగిలిన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా యావరేజ్ గానే నిలిచింది.

ఇక బాలీవుడ్ లోనే అప్పట్లో సంచలనం సృష్టించిన “ఆగ్” అనే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తుఫాన్ అనే పేరుతో రీమేక్ అయ్యి, అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.అందుకే క్లాసిక్ లాంటి అద్భుతమైన సినిమాలను కొన్ని సందర్భాలలో రీమేక్ చేయకపోవడమే ఉత్తమం అని విశ్లేషకులు చెబుతూ.

కానీ ఇప్పటికీ మన దర్శక నిర్మాతలు చేతులు కాల్చుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube