సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అభిమానులు సెలబ్రెటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో అభిమానులు మరింత ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.
సెలబ్రిటీలు సైతం అభిమానులతో వారి వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్స్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ సెలబ్రిటీలపై నెగటివ్ గా కామెంట్స్ చేయడం వారిపై దారుణంగా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.
తాజాగా కూడా ఒక నటి తనకు అవకాశాలు రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయగా ఆ ట్వీట్ పై స్పందించినా కొందరు నెటిజెన్స్ నీకు అసలు యాక్టింగ్ కూడా రాదు అంటూ కామెంట్స్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే.
తమిళ నటి రేష్మ పసుపులేటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారికి ఈమె సుపరిచితమే.
మొదట మసాలా పాదం అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేష్మ.సినిమాల ద్వారానే కాకుండా తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం భాగ్యలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది.
ఇకపోతే తాజాగా రేష్మ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ ని చేసింది.ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ.నాకు లోకేశ్ కనగరాజన్ సినిమాలో నటించాలనుంది.
కానీ ఆయనని ఎలా సంప్రదించాలో తెలియడం లేదు.ఎవరైనా నన్ను ఆయన దగ్గరకు చేర్చండి.
ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు అవుతోంది.కానీ సరైన అవకాశాలు లేవు.
మా కంటే కొత్తగా వచ్చినవారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.ఆ విషయాన్నీ నేను పూర్తిగా తప్పుపట్టడం లేదు.
కానీ ఇది నిజంగా అన్యాయం.ఈ అసమానతలు లేని సిస్టమ్ రావాలి అని ట్వీట్ చేస్తూ దానికి కొన్న ఫోటోలు జత చేసింది రేష్మ. ఈ పోస్ట్ పై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.
ఇప్పటిదాకా నటించింది చాలులే నిన్ను టీవీలో చూస్తేనే భయమేస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు నటన చాలులే ఇక ఆపేసేయ్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగా నిన్ను టీవీలో చూస్తేనే భయమేస్తుంది.
అలాంటిది నేరుగా చూస్తే ఏమైపోవాలో, పైగా నీకంత యాక్టింగ్ కూడా రాదు.ముందు నీ వృత్తి మార్చుకో అని సెటైర్లు వేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy