ఆసియా కప్ టోర్నీ( Asia Cup )లో భాగంగా సెప్టెంబర్ 10 ఆదివారం భారత్- పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.కొలంబో( Colombo ) వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కు కచ్చితంగా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆదివారం జరిగే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు రిజర్వ్ డే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 4న భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకున్న ఏసీసీ ఈసారి అలా జరగకూడదని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

సాధారణంగా ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే అప్పుడప్పుడు రిజర్వ్ డేను కేటాయిస్తారు.ఈ విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆసియా కప్ టోర్నీలో ఇతర మ్యాచ్లకు కాకుండా కేవలం ఈ ఒక్క మ్యాచ్కే రిజర్వ్ డే కేటాయించడం ఎన్నో విమర్శలకు దారితీసింది.
కానీ తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

భారత్- పాకిస్తాన్( India Pakistan ) మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే మరుసటి రోజు ఆట కొనసాగిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది.ఇక ఆదివారం కొనుగోలు చేసిన టికెట్ తోనే సోమవారం కూడా క్రికెట్ అభిమానులు మ్యాచ్ వీక్షించవచ్చని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది.ఈ టోర్నీలో మొదట రద్దయిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ చూడలేకపోయామని నిరాశ చెందిన అభిమానులకు ఇది మంచి శుభవార్త.
క్రికెట్ అభిమానులు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.







