టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా హిట్ కాంబినేషన్లకు( Hit Combinations ) ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.హిట్ కాంబినేషన్ చాలా సందర్భాల్లో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడం జరుగుతుంది.
హిట్ కాంబినేషన్లు రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మహేష్ త్రివిక్రమ్( Mahesh Trivikram ) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాకపోయినా మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎన్టీఆర్ కొరటాల( NTR Koratala Siva ) కాంబోలో జనతా గ్యారేజ్ తర్వాత మరో మూవీ ఫిక్స్ అయింది.ఈ సినిమా జనతా గ్యారేజ్ ను మించిన హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ హైలెట్ కానున్నాయని తెలుస్తోంది.

బన్నీ సుకుమార్( Allu Arjun Sukumar ) కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కగా పుష్ప2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.విజయ్ దేవరకొండ పరశురామ్, నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లు సైతం రిపీట్ అవుతున్నాయి.

కమల్ శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో లియో పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది.ఈ రిపీట్ కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్లుగా నిలుస్తాయో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.ఈ రిపీట్ కాంబో సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.







