నా కొడుకును అలా చూడాలని ఉంది... అకిరా గురించి ఎన్నో కలలు కంటున్న రేణు దేశాయ్?

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్యగా, నటిగా రేణు దేశాయ్(Renudesai) అందరికి సుపరిచితమే.

సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా అందరికి అందుబాటులో ఉంటుంది.

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత సినిమాలకు దూరమైనటువంటి  రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.రవితేజ(Raviteja) టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాలో హేమలత లవణం అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తుంది.ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రేణు దేశాయ్ తన కుమారుడు అఖీరానందన్ (Akira Nandan) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖిరానందన్ సినిమా ఇండస్ట్రీలోకి వస్తే చూడాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీలోకి రావడం గురించి గతంలో రేణు దేశాయ్ మాట్లాడుతూ తనకు యాక్టింగ్( Acting ) అంటే ఏమాత్రం ఇంటరెస్ట్ లేదని తన హీరోగా రాడు కానీ తనుకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంటూ తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ఇదివరకే చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే.

అయితే మీ కొడుకును ఎలా చూడాలని మీరు కలలు కంటున్నారు అనే ప్రశ్న ఈమెకు ఎదురు కావడంతో తన కుమారుడు చుట్టూ వందల మంది ఉండి స్టేడియంలో తాను పియానో వాయిస్తుంటే చూడాలని ఉంది.అలాగే ఏ తల్లి అయినా తన కొడుకుని స్క్రీన్ మీద చూడాలి అనుకుంటుంది.కానీ అకిరా ఏం అవ్వాలనుకుంటున్నాడో అది తన ఇష్టం.

అకిరాకు యాక్టర్ అవ్వాలని ఉందని చెప్పినా, ఇంకేదైనా సరే ఓకే చెప్తాను అని తెలిపింది.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు