సినీనటి రేణు దేశాయ్ ( Renu Desai )పవన్ మాజీ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఈ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది.
అయితే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు తీసుకొని విడిపోయారు.
అయితే అప్పటికే పలు సినిమాలలో నటించిన రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయిన తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు. ఇక ఇద్దరు పిల్లలతో ఒంటరిగా కలిసి ఉంటున్నటువంటి ఈమె పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ పిల్లలను పెంచి పెద్ద చేశారు పిల్లల కోసం ఈమె రెండో పెళ్లి కూడా చేసుకోలేదని పలు సందర్భాలలో తన రెండో పెళ్లి గురించి వెల్లడించారు.ఇక పిల్లల ప్రస్తుతం పెద్ద కావడంతో రేణు దేశాయ్ తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఇటీవల రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా రేణు దేశాయ్ పాత్రకు మాత్రం మంచి పేరు లభించింది.
ఇక ఈ సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది అయినా ఈమె తదుపరి సినిమాను ప్రకటించలేదు దీంతో రేణుదేశాయి సినిమాలకు దూరం అవుతారు అని అందరూ భావించారు కానీ ఈమె మాత్రం తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చేశారు.సినిమా షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.ఏడాది తర్వాత సినిమా షూటింగ్ కోసం అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది అయితే ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy