దిగ్గజ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియోకి భారీ షాక్ తగిలింది.చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒక్క నెలలోనే 1 కోటి 29 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను జియో సంస్థ కోల్పోయింది.
డిసెంబర్ నెలలో జియో ఈ స్థాయిలో కస్టమర్లను కోల్పోయినట్టు ట్రాయ్ తన లేటెస్ట్ రిపోర్టులో వెల్లడించింది.ఈ రేంజ్ లో కస్టమర్ల సంఖ్య తగ్గటం దాని పేలవమైన సేవలకు నిలువుటద్దంగా నిలుస్తోంది.
నిజానికి మిగతా నెట్‌వర్కుల మొబైల్ సర్వీసులు కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు.
సోషల్ మీడియా వేదికగా మొబైల్ యూజర్లు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అయితే ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ సేవలు కాస్త మెరుగ్గా ఉండటంతో దానికి ఆకర్షితులవుతున్నారు కస్టమర్లు.అందుకే డిసెంబర్ నెలలో ఎయిర్‌టెల్‌లో 4.75 లక్షల మంది కొత్తగా చేరారు.కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ప్లాన్ లను కూడా పరిచయం చేస్తోంది.
అందుకే వీటి చందాదారుల సంఖ్య తగ్గడం అటుంచితే ప్రతి నెలా పెరుగుతోంది.అలా ఇప్పటివరకు ఎయిర్‌టెల్ ఉపయోగిస్తున్న కస్టమర్ల సంఖ్య 35.57 కోట్లకు చేరుకుంది.ఇక జియో ఇప్పుడు 41.57 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది.
మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ కూడా ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ లను తీసుకొస్తూ చందాదారుల సంఖ్య భారీగా పెంచుకుంటోంది.ఇది రీఛార్జ్ ప్లాన్ల ధరలు కూడా ఏ మాత్రం పెంచడం లేదు.అందుకే డిసెంబర్ ఒక్క నెలలోనే కొత్తగా 11 లక్షల మంది సబ్ స్కైబర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చేరారని ట్రాయ్ సంస్థ వెల్లడించింది.
కొద్ది రోజుల క్రితం మొట్టమొదటిగా ఎయిర్ టెల్ సంస్థ 20 శాతానికి పైగా రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచింది.దీంతో చాలామంది ఎయిర్‌టెల్ నుంచి వేరే వాటికి మారాలి అనుకున్నారు.
కానీ మిగతా సంస్థలు కూడా తమ రీఛార్జ్ భారీగా పెంచేశాయి.దీంతో ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.
ఇక వోడాఫోన్ ఐడియా సంస్థ ఒకే నెలలో 16 లక్షల మంది కస్టమర్లను పోగొట్టుకుంది.