ఆర్.ఎక్స్ 100 సినిమాను మిస్సైన తెలుగు హీరోయిన్ ఈమే.. ఆ రీజన్ల వల్లే నో చెప్పిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్.ఎక్స్ 100 సినిమా( RX 100 ) కూడా ఒకటి కాగా ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

 Rekha Bhoj Missed The Opportunuity In Rx100 Movie Details, Rx 100 Movie, Rekha B-TeluguStop.com

అజయ్ భూపతి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో మెప్పించడం గమనార్హం.అయితే ఈ సినిమాను తెలుగమ్మాయి అయిన రేఖా భోజ్( Rekha Bhoj ) రిజెక్ట్ చేసిందట.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేఖా భోజ్ ఈ విషయాలను వెల్లడించారు.

నాకు ఫోన్ వచ్చిన సమయంలో 10 లిప్ లాక్ సీన్లు( Liplock Scenes ) ఉన్నాయని చెప్పడంతో నేను చేయలేనని చెప్పానని ఆమె అన్నారు.

సినిమా విడుదలైన తర్వాత నేను ఫీలయ్యానని రేఖాభోజ్ పేర్కొన్నారు.కథ చెప్పకుండా రొమాన్స్, లిప్ లాక్ సీన్లు ఉన్నాయని చెప్పడంతో ఆ సినిమాను మిస్ చేసుకున్నానని రేఖా భోజ్ అన్నారు.

ఆ సినిమా నిర్మాత కూడా తన స్నేహితుడని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఆర్.ఎక్స్100 మూవీ విషయంలో నేను రిగ్రెట్ అవుతానని ఆమె అన్నారు.కథ విషయంలో నేను రాంగ్ స్టెప్ వేశానని రేఖా భోజ్ పేర్కొన్నారు.

ఆ సినిమా చేసి ఉంటే మంచి స్థానంలో ఉన్నానని ఆమె అన్నారు.శ్రీదేవి సోడా సెంటర్( Sridevi Soda Center ) సినిమాలో నాకంటే ముందు ఆనంది గారిని అడిగారని అందువల్ల నేను ఎంపిక కాలేదని రేఖా భోజ్ చెప్పుకొచ్చారు.

రేఖా భోజ్ కు సక్సెస్ దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

అడిషన్స్ ఇస్తే ముందు ఒక విధంగా వెనుక ఒక విధంగా మాట్లాడతారని రేఖా భోజ్ అన్నారు.సినిమాల్లో అమ్మాయిలు అంటే చీప్ గా చూస్తారని ఆమె కామెంట్లు చేశారు.రేఖా భోజ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

రేఖా భోజ్ రాబోయే రోజుల్లో అయినా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube