జగన్ పై దాడి విషయంలో స్పందించని పవన్ కళ్యాణ్.. సైలెన్స్ వెనుక కారణాలివేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) పై జరిగిన దాడి విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

 Reasons Behind Pawan Kalyan Silence In Jagan Issue Details Here Goes Viral,pawan-TeluguStop.com

జగన్ పై దాడి విషయంలో టీడీపీ ఇష్టానుసారం ట్వీట్లు చేస్తున్నా చంద్రబాబు మాత్రం సానుభూతి తెలుపుతూ స్పందించడం జరిగింది.అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Janansena Pawan kalyan ) మాత్రం జగన్ పై దాడి విషయంలో సైలెంట్ గా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా స్పందించకపోయినా సోషల్ మీడియా వేదికగా అయినా రియాక్ట్ అవుతారని చాలామంది భావించగా అందుకు భిన్నంగా జరిగింది.పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనల విషయంలో స్పందించకుండా ఇస్తున్న సందేశం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి పాజిటివ్ గా స్పందించినా నెగిటివ్ గా స్పందించినా సమస్యేనని ఫీలవుతున్నారని తెలుస్తోంది.ఆ రీజన్ వల్లే పవన్ కళ్యాణ్ కు స్పందించే ఆలోచన అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబుపై గతంలో దాడి జరిగిన సమయంలో గగ్గోలు పెట్టిన నేతలు ఇప్పుడు మాత్రం సీఎం జగన్( Attack on CM YS Jagan ) ను అవహేళన చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.జగన్ విషయంలో కొన్ని ఛానెళ్లు అమానవీయంగా వ్యవహరిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా కొన్ని విషయాలలో మారాల్సి ఉంది.

జనసేనపై ఎక్కడైనా చిన్న దాడి జరిగినా ఘాటుగా స్పందించే పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ విషయంలో ఇంత పెద్ద ఘటన జరిగినా సైలెంట్ గానే ఉంటున్నారు.పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సీఎం( Future CM ) కావాలని భావిస్తున్న వ్యక్తి కాగా చిన్నచిన్న తప్పులే జనసేనకు మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.భవిష్యత్తులో అయినా పవన్ ఈ ఘటన గురించి రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube