జబర్దస్త్ షోలో సంవత్సరాల తరబడి కామెడీ స్కిట్లు చేసి ఆ స్కిట్లతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్న వాళ్లలో చమ్మక్ చంద్ర ఒకరు.అయితే దాదాపు ఏడాది క్రితం వేర్వేరు కారణాల వల్ల చమ్మక్ చంద్ర జబర్దస్త్ షోకు హాజరయ్యారు.
సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో తనకు జబర్దస్త్ షోలో అవకాశం వచ్చిందని కామెడీ టైమింగ్ బాగుండటంతో తనకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చిందని చమ్మక్ చంద్ర కామెంట్లు చేశారు.
జబర్దస్త్ షో భారీస్థాయిలో సక్సెస్ అవుతుందని నమ్మకం లేదని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.
అయితే టీమ్ లీడర్ ఛాన్స్ రావడం మంచి అవకాశమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించానని చమ్మక్ చంద్ర తెలిపారు.స్కిట్ వారం పది రోజుల ముందు ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేసేవాడినని చమ్మక్ చంద్ర అన్నారు.
ఐదారు ఎపిసోడ్ల తరువాత ఊహించని స్థాయిలో జబర్దస్త్ షో సక్సెస్ అయిందని చమ్మక్ చంద్ర తెలిపారు.
ప్రతి ఒక్కరూ ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించడంతో పోటాపోటీగా మంచి స్కిట్లు వచ్చాయని రేటింగ్స్ చూసి తాము షాకయ్యామని చమ్మక్ చంద్ర కామెంట్లు చేశారు.
తాను సరదాగా స్కిట్లు చేస్తానని చమ్మక్ చంద్ర పేర్కొన్నారు.తనకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువని లేడీస్ పై సెటైర్లు వేసినా వాళ్లకు నచ్చుతాయని చమ్మక్ చంద్ర తెలిపారు.
నాగబాబు అలర్ట్ చేయడం వల్లే జబర్దస్త్ ఇన్ని సంవత్సరాలు రన్ అయిందని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ లో బిజీగా ఉన్న సమయంలో మూడు నెలలు బ్రేక్ తీసుకోవడం గురించి చెబుతూ స్కిట్ లో గట్టిగా అరవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.అందుకే బ్రేక్ ఇచ్చానని చమ్మక్ చంద్ర తెలిపారు.అదిరింది షోలో ఆఫర్ రావడం వల్లే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని జబర్దస్త్ షో డైరెక్టర్లు అదిరింది షో చేస్తుండటంతో వాళ్లకు సపోర్ట్ ఇచ్చామని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
మల్లెమాల వాళ్లు కూడా ఏమీ అనలేదని కంఫర్ట్ చూసుకోమని చెప్పారని చమ్మక్ చంద్ర తెలిపారు.