Megastar chiranjeevi: ఆ ఇల్లు కారణంగానే మెగా ఇంట్లో అ శుభాలు జరుగుతున్నాయా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఫ్యామిలీలలో మెగా కుటుంబం ఒకటి.

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవిని( Chiranjeevi ) ఆదర్శంగా చేసుకొని మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే వీరంతా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో గత కొద్ది రోజులుగా అన్ని కూడా బాధాకరమైనటువంటి సన్నివేశాలు జరగడమే కాకుండా మెగా కుటుంబం కూడా భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

అయితే ఇలా మెగా కుటుంబం ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడానికి కారణం మొగల్తూరులో ఉన్నటువంటి ఇల్లే కారణమని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఏడాది మెగా హీరోలు నటించిన మూడు సినిమాలు ఒకటే నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్, చిరంజీవి నటించిన సినిమాలు మూడు కూడా డిజాస్టర్ గా మిగిలిపోయిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

మరోవైపు నిహారిక వెంకట చైతన్య ( Niharika, Venkata Chaitanya )విడాకుల వార్త కూడా మెగా కుటుంబం జీర్ణించుకోలేనిదని చెప్పాలి.ఈ విధంగా మెగా కుటుంబం గత కొంతకాలంగా ఈ విషయాల గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.అయితే ఈ ట్రోల్స్ రావడానికి మొగల్తూరులో ఉన్నటువంటి ఇల్లే కారణమని ఒక వార్త వెలుగులోకి వచ్చింది.

మొగల్తూరులో( Mogultur ) ఉన్నటువంటి ఇంటిని చిరంజీవి కోసం ఇస్తానని చెప్పి దానిని 3 లక్షలకు అమ్ముకున్నారని అందుకే తన ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ ఇంటి విషయంలో చిరంజీవి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

ఆ ఇంటితో తనకు ఏమాత్రం సంబంధం లేదని అది నేను పుట్టిన ఇల్లు కానీ ఆ ఇల్లు నా సొంత ఇల్లు కాదు.నాకు ఆ ఇంటికి ఎలాంటి హక్కులు లేవు.అది తన మేనమామ ఇల్లు అని చిరంజీవి తెలియచేశారు.

అయితే తాను లైబ్రరీ కోసం ఇల్లు ఇస్తానని వార్తలు వచ్చాయి.కానీ ఆ వార్తల పట్ల చిరు స్పందించి లైబ్రరీ ( Library ) కోసం మొగల్తూరు( Mogalthuru ) లో సొంత డబ్బుతో ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఇచ్చానని కూడా తెలిపారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇలా లైబ్రరీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని చిరంజీవి ఏర్పాటు చేసినప్పటికీ తన గురించి ఇలాంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి.అయితే ఆ ఇంటి కారణంగానే చిరంజీవికి తన ఇంట్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలను మెగా ఫాన్స్ కొట్టి పారేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు