తిరుమల నడకదారులు అనేకం, కాని ఒకే మార్గం వినియోగంలో ఉంది.. ఎందుకో తెలుసా?

భారతదేశంలో అతి ప్రాచీనమైన, ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాస్థానం ఒకటిగా నిలుస్తుంది.

అద్బుతమైన పకృతి సౌందర్యం మద్యలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రోజుకు లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు.

ప్రత్యేక రోజుల్లో కోటి మందికి పైగా కూడా వస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దేశ విదేశాల నుండి తిరుమల శ్రీ వెంకటేశుని దర్శనంకు వస్తారు.

తిరుపతి నుండి తిరుమల వెళ్లేందుకు మనకు తెలిసినవి రెండు మార్గాలు.

రెండు మార్గాల్లో ఒకటి రోడ్డు మార్గం.ఈ మార్గంలో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు వెళ్తాయి.ఇక మరో మార్గం అలిపిరి నుండి నడక మార్గం.

Advertisement

ఈ నడక మార్గం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కాలి నడకన వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు.కాలి నడక మార్గం అంతా బాగానే ఉంటుంది.

మెట్లు మరియు అడవి జంతువులు ఎటాక్‌ చేయకుండా ఇరువైపుల కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది.అయితే ఈ రెండు దారులు కాకుండా తిరుమల కొండ ఎక్కేందుకు మరో అయిదు మార్గాలు ఉన్నట్లుగా పెద్దలు చెబుతున్నారు.

వందల ఏళ్ల క్రితం తిరుమల కొండపైకి జనాలు ఏడు మార్గాల ద్వారా ఎక్కేవారు.ఎటువైపుగా వీలుంటే అటుగా తిరుమల ఏడు కొండలు ఎక్కేవారు.ఏడు కొండలకు ఏడు మార్గాలు అంటూ అప్పట్లో ఉండేది.

అయితే కాల క్రమేనా ఏడు దారుల్లో అయిదు దారులు మూసుకు పోయాయి.రాక పోకలు జరుగక పోవడంతో ఆ మార్గాలు మూసుకు పోయినట్లుగా చెబుతున్నారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఇప్పటికి కొందరు కొండపైకి అక్రమంగా వెళ్లేందుకు ఆ దారులను వినియోగిస్తున్నట్లుగా చెబుతున్నారు.అయితే ఆ మార్గంలో వెళ్లే దుష్ఠులను వెంకటేశ్వర స్వామి వారిని కాపాడుకునే పులులు మరియు సింహాలు ఇతర జంతువులు చంపేస్తాయని అంటారు.

Advertisement

అన్ని మార్గాల ద్వారా భక్తులు వచ్చినా కూడా సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, జంతువులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఆ దారులను మూసి వేసి ఉంటారు.వాటిని మళ్లీ తెరిచే ఆలోచన కూడా టీటీడీ వారు చేయడం లేదు.

ఏం జరిగినా, ఏం చేసినా దేవుడి చర్య అనుకోవాలి.అందుకే ఇది కూడా దేవుడు ఆ మార్గాలను మూయించి ఉంటాడని కొందరు భక్తులు నమ్ముతున్నారు.

తాజా వార్తలు