ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి( Magunta Sreenivasulu Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ కుటుంబం టీడీపీలో( TDP ) చేరడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ మేరకు టీడీపీ మరియు జనసేన అధినేతల అనుమతితో పార్టీలో చేరతామని స్పష్టం చేశారు.ఎక్కడ, ఎప్పుడు పార్టీలో చేరతామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

తనకు రిటైర్మెంట్ వయసు వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) చెప్పానన్న మాగుంట తన కుమారుడు రాఘవ రెడ్డి( Raghava Reddy ) పోటీ చేస్తారని తెలిపారు.అయితే గత కొన్ని రోజుల క్రితమే మాగుంట వైసీపీ పార్టీని( YCP ) వీడిన సంగతి తెలిసిందే.







