ఆర్‌బీఐలో ఉద్యోగావకాశాలు !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.పోస్టుల వివరాలు.

జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 23 పోస్టులు అర్హత: 65 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) లేదా 55 శాతం మార్కులతో డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్).

అనుభవం: సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి రెండేళ్లు, డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏడాది అనుభవం ఉండాలి.వయసు: 01.01.2019 నాటికి 20 -30 సంవత్సరాల మధ్య ఉండాలి.02.01.1989 - 01.01.1999 జన్మించి ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ద్వారా.పే స్కేలు: ఎంపికైన అభ్యర్థులకు ఆరంభంలో రూ.21,400 బేసిక్ పే ఇస్తారు.ఇతర భత్యాలు అన్నీ కలుపుకుని నెలకు రూ.49,026 వరకు అందుతాయి.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2019.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2019.ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.01.2019.దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 15.02.2019.పరీక్ష తేది: ఫిబ్రవరిలో.

వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!
Advertisement

తాజా వార్తలు