గడ్కరి పై గురిపెట్టిన రాయలసీమ ఫైర్ బ్రాండ్

రాయలసీమలోని ఫైర్ బ్రాండ్ నేతల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి( Byreddy Rajashekar Reddy ) ఒకరు, రాజకీయంగా స్తిరత్వం లేక అనేక పార్టీలు మారిన ఈ సీనియర్ నేత రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ పరిరక్షణ వేదిక పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి వివిధ పోరాటాలు చేశారు.

ముఖ్యంగా రాయలసీమ ప్రజానీకానికి సాగునీరు అందించే విషయంపై ఈయన అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా ఉంది .

ఇప్పుడు నితిన్ గడ్కరీ( Nitin Gadkari )శాంక్షన్ చేసిన ఒక పథకానికి సంబంధించి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మించి దానిని టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేయాలన్న నిర్ణయం మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి గడ్కరి నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై ఒక బ్లూ ప్రింట్ ను కూడా ఫైనల్ చేసి మీడియాకు విడుదల చేశారు.అయితే దీనిపై తీవ్రంగా మండిపడ్డారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి .తీగల వంతెనగ బదులు బ్రిడ్జ్ కం రోడ్డు వంతెన కడితే అది ఇరు రాష్ట్రాల కు ప్రయోజనకరంగా ఉంటుందని ,దాంతో పాటు రాయలసీమ రైతాంగానికి నీటి కొరత తీరుతుందని ఆయన చెప్తున్నారు.రోడ్ కంబ్రిడ్జ్ కు 750 కోట్లు సరిపోతాయని అదే తీగల వంతునకు 1200 కోట్లు ఖర్చుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని ఇది రాయలసీమకు ద్రోహం చేయడమేనని గడ్కరి రాయలసీమ ద్రోహిగా మారారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు .ఈ నిర్ణయం పై ఈ నెల 28న చలో ఢిల్లీకి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు .

అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన కామెంట్లపై రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswari ) స్పందించారు.బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితికి సంబంధించిన వ్యక్తి అని ఆయనకు భాజపాతో సంబంధం లేదని ఆయన కుమార్తె మాత్రమే మాతో కలిసి ఉన్నారని, రాయలసీమ హక్కులకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఆయన నితిన్ గడ్కరి తో డైరెక్ట్ గా కలిసి మాట్లాడవచ్చు అని అందుకు మాకు ఏ విధమైన అభ్యంతరం లేదంటూ ఆమే చెప్పుకొచ్చారు .

Advertisement
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

తాజా వార్తలు