మాస్ మహారాజా రవితేజ- గోపీచంద్ మలినేని కాంబో ( RT4GM ) మరోసారి రిపీట్ కాబోతుంది.ఇప్పటికే ఈ కాంబో మూడు సార్లు రాగా మూడు సార్లు కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
దీంతో ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో రవితేజ కొత్త మూవీ గత కొద్దీ రోజుల క్రితమే ప్రకటించారు.
డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత నాల్గవ సారి ఈ కాంబో చేతులు కలిపింది.ఇక రవితేజ ( Raviteja ) ఒక సినిమా రిలీజ్ అయితే మరో సినిమాను లాంచ్ చేయడం మాములే.
అలాగే మొన్న దసరాకు టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao ) అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా వెంటనే మళ్ళీ కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు.
ఇక మేకర్స్ కూడా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసారు.
తాజాగా ఈ సినిమా నుండి స్టోరీ ఇదే అంటూ మ్యాటర్ లీక్ అయ్యింది.వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో( Rayalaseema ) ఉంటుందట.
పైగా ఈ సినిమా కోసం సీమ యాస కూడా మాస్ రాజా నేర్చుకోనున్నాడు అని టాక్.

అదే యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారని ఈ సినిమాలు సీమ యాసలో చెప్పే మాస్ రాజా డైలాగ్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది.ఈ సినిమాకు థమన్( Thaman ) సంగీతం అందిస్తున్నట్టు తెలిపారు.జీకే విష్ణు కెమెరా హ్యాండిల్ చేయనుండగా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ సినిమాలో భాగం అయ్యారు.

మైత్రి మూవీస్ బ్యానర్( Mythri Movies ) వారు నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.ఇక వీరసింహారెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న గోపీచంద్ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తారో మాస్ రాజాకు క్రాక్( Krack ) వంటి విజయం ఇస్తాడో లేదో చూడాలి.ఇక ఈ లోపులోనే రవితేజ ఈగల్ సినిమాతో సంక్రాంతికి అభిమానులను పలకరించబోతున్నాడు.