బాలయ్యతో హాలీవుడ్‌ రేంజ్‌లో 'ఐరెన్‌ మ్యాన్‌' తీస్తాడట

నందమూరి బాలకృష్ణతో ఐరెన్‌ మ్యాన్‌ అనే చిత్రాన్ని చేస్తానంటూ దర్శకుడు రవిబాబు చాలా నమ్మకంగా చెబుతున్నాడు.

కథ ఇంకా ఏదీ అనుకోలేదని, భవిష్యత్తులో ఒక మంచి సినిమా తీయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

తాజాగా రవిబాబు ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.రవిబాబు మాట్లాడుతూ నాకు ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోల్లో బాలకృష్ణ అంటే చాలా అభిమానం అన్నాడు.

ఆయన తీరు నాకు చాలా నచ్చుతుందని, ఆయనతో నాకు మంచి పరిచయం కూడా ఉందని రవిబాబు పేర్కొన్నాడు.బాలకృష్ణ గారికి కూడా నేనంటే ప్రత్యేకమైన అభిమానం.

ఆ అభిమానంతోనే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదలైన తర్వాత నాతో ఒక సినిమా చేస్తావా అంటూ బాలకృష్ణ గారు స్వయంగా పోన్‌ చేసి అడిగారు.నా కోసం ఒక స్క్రిప్ట్‌ రెడీ చేయమని ఆయన కోరాడు.

Advertisement

అప్పుడు నేను మీతో సినిమా చేయాలంటే అదృష్టం ఉండాలని అన్నాను.అందుకు ఆయన కూడా నీతో సినిమా చేసే అవకాశం కూడా అదృష్టం అన్నాడు.

అందరికి ఛాన్స్‌లు ఇస్తున్నావు, నాకు ఇవ్వవా అంటూ ఆయన అడిగాడు.

  బాలకృష్ణ గారితో తప్పకుండా సినిమా చేస్తాను.అది ఏ కథ అయినా, ఎలాంటి స్క్రీన్‌ప్లే అయినా కూడా హాలీవుడ్‌ హిట్‌ మూవీ ఐరెన్‌ మ్యాన్‌ టైటిల్‌నే పెడతానంటూ చెప్పుకొచ్చాడు.హాలీవుడ్‌ రేంజ్‌లో బాలకృష్ణతో సినిమా తీస్తానంటూ రవిబాబు చెప్పకనే చెప్పాడు.

తప్పకుండా హాలీవుడ్‌ స్థాయిలో రవిబాబు సినిమా అయితే ఉంటుంది.కాని హాలీవుడ్‌ స్టైల్‌ మూవీలో బాలయ్య ఎలా ఉంటాడు అనేది అనుమానం.

మీ జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

రవిబాబు సినిమాలు కాస్త హాలీవుడ్‌ స్టైల్‌లో ఉంటాయి.అందుకే నందమూరి ఫ్యాన్స్‌ బాలయ్యతో ఈయన సినిమా చేయాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు