రష్మిక సెలక్షన్ వేరే లెవెల్... రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు డిజాస్టర్... లక్ అంటే ఇదే మరీ!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇటీవల ఈమె యానిమల్, పుష్ప2, ఛావా అని సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే సికిందర్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఇలా సినిమా కథల ఎంపిక విషయంలో రష్మిక ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ సినిమాలకు కమిట్ అవుతూ ఉంటారు.గతంలో ఈమె కొన్ని  సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇలా రష్మిక రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

Advertisement

ఇలా ఈమె రిజెక్ట్ చేసి మంచి పని చేసినప్పటికీ, ఆ సినిమాలలో నటించిన ఇద్దరి హీరోయిన్లు డిజాస్టర్ సినిమాలను వారి ఖాతాలో వేసుకున్నారు.మరి రష్మిక రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి? ఆ సినిమాలలో నటించి ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకున్న హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే.

కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ చిరంజీవి హీరోలుగా నటించిన చిత్రం ఆచార్య ( Acharya ) ఇందులో రామ్ చరణ్ కి జోడిగా ముందుగా రష్మికను తీసుకోవాలని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల రష్మిక రిజెక్ట్ చేయడంతో పూజ హెగ్డే( Pooja Hegde ) ఈ సినిమాలో నటించారు ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో బీస్ట్  సినిమా( Beast Movie ) కోసం రష్మికను సంప్రదించారు.అయితే ఈ సినిమాని కూడా రష్మిక రిజెక్ట్ చేయడంతో మరోసారి పూజ హెగ్డే బలైపోయింది.

ఇక తాజాగా రాబిన్  హుడ్( Robinhood ) సినిమాకి కూడా మొదట రష్మికను ఎంపిక చేశారు.కానీ కొన్ని కారణాల వల్ల రష్మిక తప్పుకోవడంతో శ్రీ లీల ( Sreeleela ) నటించారు.

రష్మిక రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈమె సెలక్షన్ మరో లెవెల్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు