'పుష్ప 2' కోసం రెడీ అయ్యిన శ్రీవల్లి.. సెట్ లో అడుగుపెట్టేది అప్పుడే!

ఛలో, భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఈ మధ్య బాలీవుడ్ చెక్కేసిన విషయం తెలిసిందే.

అక్కడ వరుస అవకాశాలు వరిస్తుండడంతో అమ్మడి లక్ మారిపోయింది.

ఇక ఇటీవలే యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని మరింత జోష్ లో ఉంది.సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో మొన్నటి వరకు బిజీగా ఉన్న రష్మిక ఆ తర్వాత సినిమాల షూటింగ్ లతో బిజీ అయ్యింది.ఇప్పటికే ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ లో పాల్గొంది.

ఈ షూట్ లో పాల్గొంటూనే ఇప్పుడు పుష్ప 2 షూట్ కోసం కూడా రెడీ అవుతుందట.దీనికి సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అయ్యిన రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ పోతుంది.

Advertisement

ఇక ఇప్పుడు పుష్ప 2 షూట్ లో సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంది.డిసెంబర్ 13 నుండి రష్మిక పుష్ప 2 షూట్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

పుష్ప 1 తోనే భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు పార్ట్ 2 తో మరింత ఫేమస్ అవ్వడం ఖాయం.

అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ ( Pushpa The Rule ) 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.కాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు